Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సికింద్రాబాద్‌లోని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్ వర్క్ ఇంటర్ ఫేజ్ (పీఎమ్ వాణీ) - బిజినెస్ ప్రమోషన్ ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల టెలికాం సలహాదారు అశోక్‌కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో లక్షలాది వైఫై హాట్ స్పాట్లను సష్టించేందుకు 'పీఎమ్ వాణి' ప్రాజెక్టు వీలు కల్పిస్తుందన్నారు. గ్రామీణ ప్రజలకు బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు పీఎమ్ వాణి ఉపకరిస్తుందని చెప్పారు. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ)లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మొబైల్ డేటాతో పని లేకుండానే ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుందని అన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ కమ్యూనికేషన్లశాఖ(డాట్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (టెక్నాలజీ) కె. రాజశేఖర్ మాట్లాడుతూ పీఎం వాణిగా వ్యవహరించే ఈ పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్ వర్క్ ఇంటర్ ఫేజ్‌లో భాగంగా పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ), పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు (పీడీఓఏ) వివిధ వర్గాల భాగస్వామ్యంతో ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కమ్యూనికేషన్ల శాఖ కృషి చేస్తుందని తెలిపారు.డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అడ్మినిస్ట్రేషన్) జె. రాజారెడ్డి మాట్లాడుతూ లైసెన్స్ రహిత సంస్థలు అట్టడుగు స్థాయిలో వైఫై సేవలను అందించేందుకు పీఎమ్-వాణి వీలుకల్పిస్తుందన్నారు.