Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగుల పరస్పర బదిలీల కోసం ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈ బదిలీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల సీనియార్టీకి రక్షణ ఉంటుందని గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ బదిలీల మార్గదర్శకాలను ఇప్పటికే జీవోనెంబర్ 21ని ఫిబ్రవరి రెండున విడుదల చేశామని గుర్తు చేశారు. ఈ జీవోలోని పేరా ఏడు, ఎనిమిదిలో పేర్కొన్న నిబంధనలను మార్పులు చేస్తూ జీవోనెంబర్ 402ను గతనెల 19న జారీ చేశామని తెలిపారు. తద్వారా ఉమ్మడి జిల్లా క్యాడర్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే వారి సీనియార్టీకి కొత్త లోకల్ క్యాడర్‌లోనూ రక్షణ ఉంటుందని వివరించారు. ఈ బదిలీల కోసం దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ఈనెల 15వ తేదీలోగా సమర్పించాలని కోరారు.