Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పబ్లిక్, ప్రయివేటు రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ట్రాన్స్‌పోర్టు వాహనాల యజమానులపై ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు అరికట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్, ప్రయివేటు రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్- సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు తాళలేక నల్లగొండలో ఒకరు, వరంగల్‌లో ఆటోడ్రైవర్, హైదరాబా ద్లో క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. తాజాగా భూపాలపల్లి జిల్లా మోరంచలో నారెండ్ల సుధాకర్‌రెడ్డి (34) లారీకే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిచ్చి న్యాయం చేయాలనీ, ఆర్థిక సహకారాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిస్తీల పేరిట వేధింపులకు గురిచేస్తున్న ప్రయివేటు ఫైనాన్స్ యాజమాన్యాల లైసెన్సు రద్దు చేయాలనీ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.