Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పచ్చదనం పెంపొందించడానికి విశేషంగా కృషి చేస్తున్న పల్లవి విద్యాసంస్థలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ హరితహారం అవార్డులను ప్రదానం చేసింది. నగరంలోని ఒక హౌటల్లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పల్లవి ఇంజినీరింగ్ కాలేజీ, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ గండిపేట, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కీసర, పల్లవి మోడల్ స్కూల్ అల్వాల్ ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. పల్లవి విద్యాసంస్థల తరఫున వాటి చైర్మన్ మల్కా కొమరయ్య, సీఓఓ మల్కా యశస్వీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ విద్యాసంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నామని కొమరయ్య, యశస్వీ చెప్పారు. విద్యార్థులకు హరితహారంపై క్రమం తప్పకుండా అవగాహన కల్పిస్తూ స్కూల్స్‌లోనే కాకుండా వారీ ఇంటి ఆవరణలోనూ మొక్కల పెంపకం చేపట్టేలా కృషి చేస్తున్నామని తెలిపారు.