Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ కార్యక్రమాల నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబురాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల ఆరు, ఏడు, ఎనిమిది తేదీల్లో 'మహిళాబంధు కేసీఆర్' పేరిట సంబురాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల ఆరో తేదీన సంబురాలు ప్రారంభమవుతాయనీ, కేసీఆర్కు రాఖీకట్టడం, పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినీలు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు సన్మానం చేస్తామని చెప్పారు. కేసీఆర్ కిట్, షాదీ ముబారక్ థాంక్యూ కేసీఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏడో తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమలైన కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలిసి సెల్ఫీలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎనిమిదో తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబురాలుంటాయని పేర్కొన్నారు. పది లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు పెండ్లిలకు ఆర్థిక సహకారం అందించిన దేశంలోని తొలిప్రభుత్వం టీఆర్ఎస్ అని వివరించారు. ఇందుకోసం రూ.9,022 కోట్లు ప్రభుత్వం పెండ్లికానుక అందజేసిందని పేర్కొన్నారు. సుమారు 11 లక్షల మంది కేసీఆర్ కిట్ లబ్దిదారుల మైలురాయిని చేరుకుందని తెలిపారు. ఇప్పటి వరకు రూ.1,700 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఇతరులు బేటీ బచావో బేటీ పడావో అంటూ కేవలం నినాదాలు ఇస్తున్న సమయంలో నిజంగా విద్యార్థులను చదివించి, సంరక్షిస్తున్న ప్రభుత్వం ఇదేనని వివరించారు.