Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మిల్లింగ్ ఇండిస్టీకి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. హైటెక్స్‌లో టెక్ ఎక్స్ఫోని శుక్రవారంనాడాయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగినందున ఈ పరిశ్రమకు మహర్ధశ పట్టనున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డి, నిరాశ పరిచిందని అన్నారు. బాయిల్డ్ రైస్ తీసుకోబోమని చెప్పి కేంద్రం పంట సేకరణ చేసే అవకాశం లేకుండా చేసిందని విమర్శించారు. పంటలను ఆదాయ మార్గాలుగా చూడొద్దన్నారు. మౌళిక వసతుల కల్పన, పెట్టుబడి సాయం రాష్ట్రాల బాధ్యత అనీ, మద్దతు ధరలు, ధాన్యం సేకరణ కేంద్రం భాధ్యత అనీ వివరించారు. పండిన ధాన్యాన్ని ఎగుమతి చేయడమో, పేదలకు పంచడమో చేయాలే తప్ప, కొనబోమని కేంద్రం చెప్పడం బాధ్యతా రాహిత్యమేనని విమర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో ఏర్పాటైన 65కు పైగా స్టాళ్లను కలియ తిరిగి ఆధునిక మిషనరీ టెక్నాలజీని పరిశీలించారు. కార్యక్రమంలో రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు గణప నాగేందర్, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, ఐడీసీ ఛైర్మెన్ అమరవాది లక్ష్మీ నారాయణ, కోశాధికారి చంద్రపాల్, ముకాంభికా ఎక్స్ పో ప్రతినిది రాము తదితరులు పాల్గొన్నారు.
గడ్డిఅన్నారం మార్కెట్ తెరవండి
గడ్డిఅన్నారం మార్కెట్‌ను తెరవాలన్న గత ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తక్షణమే మార్కెట్‌ను తెరవాలని ఆదేశించింది. దీనితో అధికారులు మార్కెట్‌ను తెరిచి హైకోర్టుకు నివేదిక అందజేశారు. నెల రోజులపాటు మార్కెట్‌ను తెరవాలని ఆదేశిస్తే, తెరవలేదని కూరగాయల వ్యాపారుల కమీషన్ ఏజెంట్లు కోర్టు ధిక్కార కేసు వేశారు.