Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది. ప్రజలెవరూ నమ్మట్లేదు. ఇగ తన పనైపోయిందని భావించిన కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళుతూ అక్కడి ప్రజలకు ఆర్థిక సాయం పేరుతో కొత్త డ్రామాలాడుతున్నరు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు కుమార్ విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలనే ఎత్తుగడను కొందరు వేస్తున్నారనీ, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు బీజేపీవైపే ఉంటారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నారాయణపేట జిల్లాకు చెందిన 25 మంది బండి సమక్షంలో చేరారు. రాష్ట్రంలో వేలాది మంది రైతులు చనిపోతే కేసీఆర్ వారిలో ఒక్కరికి కూడా నయాపైసా పరిహారం ఇవ్వలేదనీ, జార్ఖండ్‌కు పోయి జవాన్లకు సాయం పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కొడుకును సీఎం చేయడానికి ప్రతిరోజూ కేసీఆర్ ఇంట్లో గొడవ జరుగుతున్నదని చెప్పారు. బీజేపీని బదనాం చేసేందుకే డీకే అరుణ, జితేందర్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలివ్వలేదనీ, ఉన్న ఉద్యోగులను 317 పేరుతో రోడ్డుపాల్జేశారని అన్నారు.