Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40లక్షల సభ్యత్వం నమోదు...
- మరో 10 లక్షలు చేయాలి
- కోఆర్డినేటర్ల సమావేశంలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం పురోగతిలో ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. 40 లక్షల సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకున్నామనీ, మరో 10 లక్షల సభ్యత్వం నమోదు చేయాలని కోరారు. కాంగ్రెస్‌కు 80 లక్షల ఓట్లు వస్తే గెలుపుఖాయమన్నారు. అందుకోసం సభ్యత్వం నమోదు చేయడంలో బాగా కృషి చేయాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో డిజిటల్ సభ్యత్వం కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్యాన్ని పూర్తి చేసి దేశంలో నెంబర్ వన్‌గా నిలిచామన్నారు. సభ్యత్వం చేసిన 40 లక్షల మంది ఒక్కోక్కరు అదనంగా ఒక్కో ఓటు తీసుకొస్తే, 80 లక్షల ఓట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇన్సూరెన్స్ పర్యవేక్షణ కోసం పార్టీ ఆఫీస్‌లో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ సభ్వత్వాన్ని చూసి భయపడిన సీఎం కేసీఆర్, పీకేను తెచ్చుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇదే తార్కారణమని వివరించారు. మంచిర్యాల అసెంబ్లీనియోజకవర్గం, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో సభ్యత్వం రికార్డు స్థాయిలో నమోదు చేయించారని అభినందించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పైరవీ లేకుండా వాళ్లకు టికెట్ ఇచ్చే హామీ నాదేనని చెప్పారు. సభ్యత్వానికి సంబంధించిన వారిపై సమగ్ర నివేదికను సోనియా గాంధీకి అందజేస్తామన్నారు.
అగ్రిగోల్డ్ ఖాతాదారుల సమస్యలను పరిష్కరించండి
రేవంత్‌కు బాధితుల వినతి
అగ్రిగోల్డ్ ఖాతాదారుల సమస్యలను పరిష్కరించాలని టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డిని బాధితుల సంఘం కోరింది. ఈమేరకు శుక్రవారం ఆ సంఘం ప్రతినిధులు... ఆయనకు వినతిపత్రం సమర్పించారు. బాధితుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ,ఏపీ, కర్ణాటక, చత్తీస్ఘడ్ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ విషయంలో సీఎం, గవర్నర్‌కు లేఖ రాస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ తరుపున ప్రస్తావించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.