Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొద్దిగా మెరుగైన ఆరోగ్యం
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జూలకంటి, చాడ, ఎస్.వీరయ్య, గ్యాదరి, బడుగుల తదితరులు పరామర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) సీనియర్ నేత మల్లు స్వరాజ్యం హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం నాటికి ఆమె ఆరోగ్యం కొంత మెరుగైందని కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లు స్వరాజ్యాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, సీపీఐ జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బొమ్మగాని ప్రభాకర్, రత్నాకర్‌రావు, తదితరులు పరామర్శించారు. వారు ఆమె ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.