Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు వచ్చినా ఢకొీట్టుకోలేవు
- తనిఖీ చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఒకే రైల్వే ట్రాక్‌పై, లేదా రైల్వే క్రాసింగ్స్ వద్ద ఎదురెదురుగా రైళ్లు వచ్చినా ఢకొీనకుండా నిరోధించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం 'కవచ్'ను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. మంత్రి నేరుగా లోకోమోటివ్‌లో ప్రయాణించి 'కవచ్' నియంత్రణ వ్యవస్థను ప్రత్యక్షంగా చూశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివద్ధి చేసినట్టు ఆయన తెలిపారు. కవచ్ వ్యవస్థను భారతీయ రైల్వే నెట్వర్క్ మొత్తానికి అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. శుక్రవారంనాడాయన లింగంపల్లి-వికారాబాద్ సెక్షన్‌లోని గుల్లగూడ-చిటిగిడ్డ రైల్వే స్టేషన్ల మధ్య 'కవచ్' (భారతీయ రైల్వే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్ ట్రయిన్ ప్రొటెక్షన్) వ్యవస్థపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో దాని పనితీరును పరిశీలించారు. రైల్వే బోర్డు చైర్మెన్ వినరు కుమార్ త్రిపాఠి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ న్యూఢల్లీ- ముంబాయి, న్యూ ఢల్లీ- హౌరా వంటి రద్దీ మార్గాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండువేల కిలోమీటర్లకు కవచ్ రక్షణ వ్యవస్థను విస్తరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రతి కిలోమీటర్‌కు రూ.40 లక్షల నుంచి రూ. 50 లక్షలు వ్యయం అవుతుందన్నారు. యూరోపియన్ మోడల్స్ కోసం అయితే సుమారుగా ప్రతి కిలోమీటర్‌కు రూ.1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. భారతీయ రైల్వేకు '4జి' స్పెక్ట్రమ్ కేటాయించామన్నారు. వాడి-వికారాబాద్, సనత్‌నగర్-వికారాబాద్- బీదర్ సెక్షన్లలో 25 స్టేషన్లను కవర్ చేస్తూ 264 కిమీల మేర కవచ్‌ను అమలు చేశారు. దీన్ని మరో 1200 కిమీలకు రాష్ట్రంలో విస్తరిస్తారు.
ఎంఎంటీఎస్‌కు రాష్ట్రం వాటా చెల్లించటం లేదు..
- కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఎంఎంటీఎస్ పనులను పూర్తి చేయటానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం తన వాటాను చెల్లించటం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... త్వరలో పీరియాడిక్ ఓవరలింగ్ కోసం టెండర్లను ఆహ్వానిస్తామని తెలిపారు. పనులను కూడా వెంటనే ప్రారంభిస్తామని అన్నారు. కాజీపేటలో పీవోహెచ్ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.