Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే ఆదివారం నుంచి బుధవారం వరకూ తెలంగాణ వ్యాప్తంగా అంబరాన్నంటేలా మహిళా దినోత్సవ సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో మహిళలు సురక్షితం, సుభిక్షంగా ఉన్నారని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమం, అభివృద్ధే ప్రధానంగా పని చేస్తున్న తమ ప్రభుత్వం... కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఇప్పటి వరకూ సుమారు 11 లక్షల మంది బాలింతలకు ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున.. రూ.1,700 కోట్లను ఖర్చు చేసిందని వివరించారు. ఫలితంగా ప్రభుత్వ దవాఖానాల్లో సురక్షిత ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఫథకాల ద్వారా మొత్తం 10.30 లక్షల మంది ఆడ బిడ్డలకు ఒక్కొక్కరికి రూ.లక్షా 116 చొప్పున రూ.9,022 కోట్లను పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని వివరించారు. సీఎం కేసీఆర్... స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించటం ద్వారా వారికి రాజకీయాల్లో సమానావకాశాలు దక్కేట్టు చేశారని నామా ఈ సందర్భంగా తెలిపారు.