Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగంపేట్
కాంట్రాక్టు పనుల్లో భాగంగా వచ్చిన బిల్లుల్లో ట్రాన్స్‌కో డీఈ రూ.18వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. టాన్స్‌కో శాఖలో క్లాస్ 2 కాంట్రాక్టు పనుల్లో భాగంగా రూ.3 లక్షలకు పైగా బిల్లులు రావడంతో ట్రాన్స్‌కో డీఈ భద్రయ్య కాంట్రాక్టర్ సాయిని రూ.20వేలు లంచం అడిగాడు. దాంతో సాయి నిజామాబాద్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ సూచనలో భాగంగా రూ.20వేలకు బదులు రూ.18వేలు ఇస్తానని డీఈ భద్రయ్యకు చెప్పడంతో ఒప్పుకున్నాడు. కాగా శుక్రవారం లంచం డబ్బులు తీసుకుంటుండగా డీఈ భద్రయ్యను డీఎస్పీ ఆనంద్‌కుమార్ తన బృందంతో దాడి చేసి పట్టుకున్నారు.