Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెజిట్ నోటిఫికేషన్‌ను ఉపసంహరించాలి
- రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు స్వాధీనం చేసుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. శనివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో తెలంగాణ డెవలంప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఇదే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జి చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా, గోదావరి నదుల్లో వెయ్యి టీఎంసీల నీరు ఉందనీ, వాటితో లక్షలాది ఎకరాలకు నీరందించవచ్చనన్నారు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు నిర్మించకుండా కేంద్రం నిర్ణయించడం సరైందికాదని చెప్పారు. ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ నది జలాలపై గెజిట్ నోటిఫకేషన్ రాజ్యాంగ వ్యతిరేకమైందని విమర్శించారు. రాష్ట్రాల్లో ఉన్న జల విద్యుత్ కేంద్రాలను కూడా కేంద్రం ఇమ్మని అడగం శోచనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, టీజేఏ అధ్యక్షులు కోదండరాం సీనియర్ సంపాదకులు కె రామచంద్రమూర్తి, కె శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.