Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు బీసీపీఎఫ్ మురళీమనోహర్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించడంతోపాటు సబ్‌ప్లాన్ అమలు చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. ఈమేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు బీసీపీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ మురళీమనోహర్, దేవళ్ల సమ్మయ్య లేఖ రాసారు. రూ.5వేలకోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారనీ, ఇప్పటికీ అమలు చేయలేదని పేర్కొన్నారు. అభివృద్ధి పథకాలల్లో నిరాధరణకు గురవుతున్నా సెమి నోమాడిక్ ట్రైబ్స్, మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్స్(ఎంబీసీ)లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
బీసీల సంక్షేమం కోసం బడ్జెట్లో సగటున 2.50శాతం మాత్రమే నిధులు కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు.జనాభాలో 50శాతం బీసీల అభివద్ధి కోసం బడ్జెట్లో ప్రతి ఏటా కనీసం 25శాతం నిధుల కేటాయించి బీసీలకు ఇచ్చిన హామీ బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.గొర్రెల పంపిణీలో జాప్యం జరుగుతున్నదనీ, చేపపిల్లల పంపిణీలో మధ్య దళారులు పెద్ద ఎత్తున లబ్ధిపొందుతున్నారని విమర్శించారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుకు ఈమెయిల్ ద్వారా లేఖను పంపించినట్టు పేర్కొన్నారు.