Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సివిల్ సప్లరు కమిషనర్‌కు కిసాన్ కాంగ్రెస్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సకాలంలో చేపట్టాలని కిసాన్ కాంగ్రెస్ కోరింది. యాసంగిలో రైతులు లక్షల ఎకరాల్లో వరి సాగు వేశారనీ, దీంతో అత్యధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈమేరకు శనివారం హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని సివిల్ సప్లరు కమిషనర్‌కు కిసాన్ కాంగ్రెస్ నేతలు ప్రచార కమిటీ ఛైర్మెన్ మధుయాష్కీ, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి ప్రసాద్‌కు మార్, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తదితరులు వినతిపత్రం సమర్పించారు.