Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు ప్రాంతాల్లో అమల్లోకి ఆంక్షలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వ విధానాలపై రాజకీయ పార్టీల నాయకులు, నిరుద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపే అవకాశం ఉండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో గుంపులుగుంపులుగా నిల్చోవడం, ఐదుగురి కంటే ఎక్కువ మంది కలిసి తిరుగడాన్ని నిషేధించారు. ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతులు లేవు. పేలుడు పదార్థాలు, మారుణాయుధాలను తీసుకెళ్లరాదు. పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడూ పరిస్థితిని తెలుసుకునేందుకు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. నగర కమిషనరేట్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూం నుంచి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తారు. నింబధనలను ఉల్లఘించిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.