Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు' పేరుతో ఈనెల తొమ్మిదో తేదీన కలిసొచ్చే రాజకీయ పార్టీలతో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్టు సీపీఐ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నపుడు కూనంనేని సాంబశివరావు బయ్యారం ఉక్కు ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగంలో ఈ పరిశ్రమను చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారని తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కోసం తలపెట్టిన నిరసన దీక్షలో ప్రజలు పాల్గొనాలని కోరారు.