Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిష్టాత్మకంగా ఈ-హెల్త్ ప్రొఫైల్
- వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు
- నర్సంపేట, పరకాలల్లో ఆస్పత్రులకు శంకుస్థాపన
నవతెలంగాణ-ములుగు/నర్సంపేట/పరకాల
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఈ-హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ములుగు జిల్లా కలెక్టరేట్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు ఈ-హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ములుగు, నర్సంపేటలో 250 పడకల, పరకాలలో 100 పడకల ఆస్పత్రులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వస్తోందని చెప్పారు. ఈ క్రమంలో ఈ-హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు.ఈ పథకం అమలు కోసం తొలి విడతగా ప్రభుత్వం రూ.9.16 కోట్లు మంజూరు చేసిందన్నారు. రెండో దశలో మిగతా జిల్లాల్లో అమలు చేస్తామని చెప్పారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే నర్సంపేటలో 250 పడకల,పరకాలలో 100పడకల ఆస్పత్రుల నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పేదల ఉసురు పోసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపట్టినా బీజేపీ నేతలు తప్పుడు విమర్శలు, దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన అనేక హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సూచించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు తెలిపారు.కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు సీతక్క, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మెడికల్ బోర్డు చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆయా జిల్లాల కలెక్టర్లు కృష్ణ ఆదిత్య, గోపి తదితరులు పాల్గొన్నారు.