Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితులకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలి : స్కైలాబ్
నవ తెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
దళితులకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ డిమాండ్ చేశారు. శనివారం నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని దేవకి ఫంక్షన్ హాల్లో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో మహిళలు దళితులు చిన్నారులకు భద్రత లేకుండా పోయిందన్నారు. దళితులకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్తు సరఫరా చేయాల్సిందేనని అన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాల అమలులో వేగం పెంచడమే కాక.. దేశంలో మనువాదాన్ని అమలు చేయడం కోసం ప్రజాస్వా మ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల అభివృద్ధి కోసం దేశంలో 329 సంక్షేమ పథకాలుంటే.. అందులో 74 పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే ఆయన కల్పించిన హక్కుల కోసం ఉద్యమాల చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి.పరుశరాములు. అధ్యక్షులు అంతటి కాశన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమయ్య, నందిపేట భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.