Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ వర్సిటీ కార్యక్రమంలో నాగేశ్వర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడు దశాబ్ధాలపాటుగా వైరం కొనసాగుతున్నదని ప్రముఖ విశ్లేషకులు, ఓయూ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సామాజిక శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో సార్వత్రిక సామాజిక వేదికలో భాగంగా ఓపెన్ టాక్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయ ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని చెప్పారు. ఈ యుద్ధ వాతావరణం ఒక్క రోజులో ఏర్పడ్డది ఆదనీ, దాని వెనుక మూడు దశాబ్ధాల చరిత్ర ఉందన్నారు. నాడు క్యూబా విషయంలో అమెరికాకు ఏర్పడ్డ గడ్డు పరిస్థితే నేడు ఉక్రెయిన్ విషయంలో రష్యాకు ఏర్పడిందని వివరించారు. అఖండ రష్యా కోసం పుతిన్ తపిస్తున్నారనీ, అమానవీయంగా దాడులకు దిగడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం దురదృష్టకరమని చెప్పారు. రష్యాతో భారత్ స్నేహపూర్వకంగా ఉందనీ, అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలున్నాయని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తటస్థంగా ఉంటూనే పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు. సామాజిక శాస్త్రాల విభాగం డీన్, సార్వత్రిక సామాజిక వేది రూపకర్త ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీశాట్ సీఈవో శైలేష్‌రెడ్డి, ఓయూ మాజీ ప్రొఫెసర్ చెన్నబసవయ్య ప్రసంగించారు.