Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం రాజ్భవన్లో నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో విజయాలను నమోదు చేసుకున్న కొంత మంది మహిళలను సత్కరించనున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి.