Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యవిద్య, ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసేందుకు ఇబ్బంది పడుతున్న ఇద్దరు విద్యార్థినీలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయమందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన పేద విద్యార్థినీలు కావేరీ (21), శ్రావణి ( 18) ఇంటర్మీడియట్ లో 95 శాతం, 97 శాతంతో ఉత్తీర్ణులై ఉచితంగా మెడిసిన్, ఇంజినీరింగ్ సీటు పొందారు. అయితే హాస్టల్, మెస్ తదితర ఫీజులు కట్టలేకపోయారు. దీంతో మంత్రి కేటీఆర,్ వారు విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు ఆ ఫీజులు కట్టేందుకు హామి ఇచ్చారు.