Authorization
Sat March 22, 2025 11:43:05 am
- ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పత్రికలు, మీడియా సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో శ్రీముట్నూరి కష్ణారావు సంపాదకీయాలు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల్లో లోపాలుంటే ఎత్తి చూపాలే గానీ, ప్రజల్లో ఆందోళన సృష్టించడం సరికాదన్నారు. పాత్రికేయులు కూడా సమాజంలో భాగమని గుర్తుంచుకోవాలన్నారు. కరోనా సమయంలో జర్నలిస్టులు చూపించిన తెగువ నిరుపమానమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి తదితరులు పాల్గొన్నారు.