Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీతో పాటు శాసన మండలి వద్ద ముందస్తు చర్యగా సాయుధ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో అడుగడుగునా సాయుధ పోలీసులతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.