Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న హరీశ్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. శాసనసభ సమావేశాలను ప్రొరోగ్ చేయకపోవడం వల్ల గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరగనున్నాయి. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. అనంతరం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కానుంది. అందులో ఎజెండా ఖరారు చేయడంతోపాటు సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో స్పష్టత రానుంది. ఇప్పటికే అసెంబ్లీ వర్గాల సమాచారమేరకు శాసనసభ సమావేశాలు 10 లేదా 12 రోజుల పని దినాలు శాసనసభ సమావేశాలు జరగనున్నట్టు సమాచారం. అయితే బడ్జెట్ ప్రతిపాదనలకు కాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సభలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు.