Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు పనులు చేస్తున్న కూలీలపైకి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రమాదం
- ముగ్గురు మృతి, ఒకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ-ఆలేరుటౌన్
అతి వేగంతో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు పట్టణ బైపాస్ బహుదూర్పేట క్రాస్ సమీపంలో ట్రాక్టర్‌ను ఢకొీని రోడ్డు పనులు చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ ఇద్రిస్‌అలీ తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు ఊరెళ్ల వరలక్ష్మి(58), శ్యామ్‌సుందర్(30), లావణ్య, అంకర్ల కవిత(35) రోడ్డు పక్కన మట్టిపనులు చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంతో వచ్చి ట్రాక్టర్‌ను ఢకొీని అక్కడ పని చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. తీవ్రగాయాలపాలైన వరలక్ష్మి, శ్యామ్‌సుందర్ అక్కడికక్కడే మృతి చెందారు. అంకర్ల కవిత,ఊరెళ్ల లావణ్యకు తీవ్రగాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం అంకర్ల కవితను ఆర్వీఎం ఆస్పత్రికి, ఊరెళ్ల లావణ్యను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అంకర్ల కవిత మృతి చెందింది. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆగ్రహించిన మృతుల కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటనాస్థలానికి చేరుకుని హైదరాబాద్-వరంగల్ జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. సీఐ నవీన్‌రెడ్డి మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి
ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌తో ఫోన్లో మాట్లాడి మృతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మృతుల కుటుంబాలకు చెందిన బడీడు పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు ఇండ్లు లేనివారికి 'డబుల్' ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీర్ల ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల ఆయిలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.