Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు కేటాయింపు. ప్రతి నియోజకవర్గానికి వంద చొప్పున 118 నియోజకవర్గాల్లో 11,800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందించనున్నారు. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి ఈ పథకం కింద లబ్ది చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,289 కోట్లతో దశల వారీగా పాఠశాలల్లో అభివద్ది పనులను ప్రభుత్వం చేపడుతున్నది. మొదటి దశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యాచరణను సర్కారు ప్రారంభించింది.
- రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్ల ప్రతిపాదన.
- అటవీ విశ్వవిద్యాలయం కోసం రూ.100 కోట్లు కేటాయింపు.
- రాష్ట్ర వ్యాప్తంగా 61 మార్చురీల ఆధునీకరణకు రూ.32.50 కోట్లను కేటాయించింది.
- 2022-23 సంవత్సరంలో ఫాం ఆయిల్ సాగును 2.5 లక్షల ఎకరాల్లో విస్తరించేందుకు రూ.వెయ్యి కోట్లు కేటాయింపు.
- వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొత్తంగా రూ.24,254 కోట్లు కేటాయింపు. గతంలో హామీ మేరకు ఈ ఏడాది రూ.75 వేల లోపు రుణాలను కూడా మాఫీ చేయాలని నిర్ణయం.
- ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.1,000కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
- రూ.11 వేల కోట్ల వ్యయంతో గొల్లకురుమలకు 7.3లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయం.
- రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.ఐదు లక్షల బీమా పథకం అమలుకు ప్రతిపాదన.
- గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక పథకం, త్వరలోనే ప్రకటన.
- బాలింతల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈలోపాన్ని నివారించేందుకు, ' కేసీఆర్ నూట్రీషియన్‌కిట్' అనే పేరుతో పోషకాహారంతో కూడిన కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. వాటి ద్వారా ప్రతి ఏటా లక్షా 25 వేల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు.
- అన్నిప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది.
- హైదరాబాద్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొరతను శాశ్వతంగా తీర్చేందుకు రూ.1200 కోట్ల ప్రతిపాదన
- దేవాలయాల్లో దూప దీప నైవేద్య పథకానికి రూ. 12.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
- రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.1, 542 కోట్ల కేటాయింపు.
- మెట్రో రైలును పాతబస్తీలో 5.5 కిలోమీటర్ల మేర అనుసంధానించేందుకు రూ.500 కోట్ల కేటాయింపు.
- భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంలో భాగంగా లక్ష మంది కార్మికులకు మోటార్ సైకిళ్లు ఇవ్వాలని ప్రతిపాదన. విధివిధానాలు త్వరలో ప్రకటన.
- రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.1000 కోట్ల కేటాయింపు.
- గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీల నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.600 కోట్ల కేటాయింపు.
- కాళేశ్వరం టూరిజం సర్య్యూట్‌కు రూ. 750 కోట్లు కేటాయింపు.
- అర్బన్ మిషన్ భగీరథకు రూ.800 కోట్లు కేటాయింపు.
- ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటికి రూ.500 కోట్లు కేటాయింపు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో రూ.1,500 కోట్ల కేటాయింపులు.
- పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ.2,142 కోట్లు, వాటికి విద్యుత్ రాయితీ కింద రూ.190 కోట్ల కేటాయింపు.
- పావలా వడ్డీ పథకాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, చిన్న తరహా పరిశ్రమలకు విస్తరించటం ద్వారా మహిళలే వాటిని ఏర్పాటు చేసే విధంగా వారిని ప్రోత్సహించేందుకు రూ.187 కోట్లు కేటాయింపు.
- హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచితంగా నీరందించే పథకానికి రూ.300 కోట్ల కేటాయింపు.
- ఆర్టీసీ బలోపేతానికి రూ.1,500 కోట్లు కేటాయింపు.