Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్లో అంకెలతో ఆశలు పెంచారనిదళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్య దర్శి పి.శంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్ అంటే అంకెల సముదాయం కాదనీ, ప్రజల ఆశలు, ఆకాంక్షల వ్యక్తికరణ అని చెప్పిన మంత్రి అంకెల గారడితో ఆశలు పెంచారే తప్ప.. ఆకాంక్షలు నెరవేరేే బడ్జెట్ను ప్రవేశ పెట్టలేదని విమర్శించారు. బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ ఎస్.డి.ఎఫ్ నిధి కింద కేటాయించిన 33,937 వేల కోట్లలో వెయ్యి కోట్లను దారి మళ్ళించారని తెలిపారు. దళిత బంధు పథకాన్ని 11,800 కుటుంబాలకు పరిమితం చెసి 17,700 కోట్లు కేటాయించారన్నారు. గత ఏడేళ్లుగా దళితుల సంక్షేమానికి రూ. 1,17,319 కోట్లు కేటాయించి కేవలం రూ.66,113 ఖర్చు మాత్రమే చేశారని తెలిపారు. రూ.41,197 కోట్ల నిధులను ఖర్చు చెయలెదని పేర్కొన్నారు. గతేడాది ఖర్చు చేయని నిధులను ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల కేటాయింపు చట్టం ప్రకారం క్యారీ పార్వర్డ్ చెయకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారని శంకర్ తెలిపారు.