Authorization
Sat March 22, 2025 09:10:17 am
- బడ్జెట్‌పై టీడీపీ నేతలు బక్కని, రావుల విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని టీడీపీ అధ్యక్షులు బక్కని నర్సింహులు, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి విమర్శించారు. నిరుద్యోగుల పరిస్థితి అంతేనని అన్నారు. ఈ బడ్జెట్ లో నిరుద్యోగ భతికి నిధులు కేటాయిస్తారనీ, జాబ్ క్యాలెండర్ పై, ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాల భర్తీపై చొరవ తీసుకుంటారని ఆశించిన యువతను మరోసారి మభ్య పెట్టారని తెలిపారు. రైతులకు రూ లక్ష రుణమాఫీని ''దఫాల హామీ''గా మార్చారు. రూ 25వేలు, రూ 50వేలు, రూ 75వేల చొప్పున ఐదేండ్లు సాగదీయడం ద్వారా అసలు కన్నా వడ్డీ పెరిగిపోయి రెండు, మూడింతల అప్పుల్లో రైతులను ముంచుతున్నారని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందని ద్రాక్షగా చేశారు. ఇప్పటిదాకా 2లక్షల ఇండ్లను నిర్మించలేదని విమర్శించారు. గహ నిర్మాణ పనులు ఇంత మందకొడిగా చేస్తే, అర్హులైన పేదలందరికీ రెండు పడకగదుల ఇండ్ల నిర్మాణానికి ఎన్నేండ్లు పడుతుందో దేవుడికే తెలియాలనీ, ప్రభుత్వమే ఇండ్లు నిర్మించే బాధ్యతనుంచి తప్పుకుని సొంత జాగా ఉన్నవాళ్లకు ఇంటి నిర్మాణానికి ఆర్ధికసాయం అందిస్తామని అనడం చూస్తుంటే, ఈ పథకం నీరుకారిపోతుందే అనే భావన ఉందని పేర్కొన్నారు.