Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పట్టణ ప్రగతికి అవసరమైన నిధులు కేటాయించడంలో ఆర్థిక మంత్రి విఫలమయ్యారని పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు విమర్శించారు. రాష్ట్రంలో 140కి పైగా ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించలేదన్నారు. పట్టణ ప్రగతికి కేవలం రూ.1,394 కోట్లు మాత్రమే కేటాయించడం కంటితుడుపు చర్యే అని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డబుల్బెడ్రూం ఇండ్లకు రూ.12వేల కోట్లు మాత్రమే కేటాయించారనీ, 2.91 లక్షల ఇండ్ల నిర్మాణారికి అనుమతి ఇవ్వగా, 1.91 లక్షలు నిర్మాణం పూర్తయినట్టు ఆర్థికమంత్రి చెప్పారని గుర్తుచేశారు. మిగిలిన లక్ష ఇండ్ల నిర్మాణానికి రూ.12వేల కోట్లు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. 125 గజాల్లోని ఇండ్లను క్రమబద్ధీకరించుకుంటే రూ.3 లక్షలు ఇస్తామని చెప్పడం సమస్యల్ని దాటవేయడమేనని అన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఆర్థిక ఊతం ఇవ్వకుండా కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. సర్కారు కేటాయింపులపై పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.