Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ పంచాయతీ సిబ్బందికి సీఐటీయూ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రం చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తగలబెట్టాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.గణపతిరెడ్డి,చాగంటి వెంకటయ్య సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలోని పంచాయతీ సిబ్బంది ఇప్పటికే ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పారిశుధ్య పనులు, పల్లె ప్రకృతి వనాలు,వీధి లైట్లు,తాగునీటి సరఫరా,ఇంటి పన్ను వసూలు, డంపింగ్ యార్డ్ నిర్వహణ,నర్సరీ తదితర పనులతో సతమతం అవు తున్నారని పేర్కొన్నారు.మళ్లీ వారితో మరుగుదొడ్లు కూడా కడిగించా లని చూడటం హేయమైన చర్య అని తెలిపారు. పంచాయతీ సిబ్బంది పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని సూచించారు.