Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ వార్షిక బడ్జెట్-2022-23 బడుగుల జీవితాలను మార్చేదనీ, అది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్లో రూ. 29, 585 కోట్లు కేటాయించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమానికి రూ.3,330 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్ల రూపా యలు కేటాయించినట్టు తెలిపారు.గిరిజన, ఆదివాసీ గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల నిర్మాణాల కోసం రూ.600 కోట్లు కేటాయించడం హర్షనీయమని పేర్కొన్నారు. మహిళలు ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సాహానికి పావలా వడ్డీ స్కీమ్ కింద రూ.187 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.దీనికి తోడుగా ప్రతినెలా స్థానిక సంస్థలకు రూ. 220.50 కోట్లు విడుదల చేస్తున్న విషయం విదితమేనని పేర్కొన్నారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో3.10లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.11,750 కోట్ల వడ్డీలేని రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 61శాతం గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు.