Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గొర్రెల పంపిణీకి కేవలం వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి గొల్లకురుమలకు తీవ్ర అన్యాయం చేశారని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. గొర్రెల పంపిణీకి కనీసం రూ. ఆరు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 7.30 లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేసి 3.80లక్షల మందికి గొర్రెలిచ్చి మిగిలిన 3.51 లక్షల మందికి మొండిచేయి చూపారని విమర్శించారు. వెయ్యి కోట్లు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు.గొర్లకాపర్లను మోసం చేయడం తగదని పేర్కొన్నారు. గొర్రెల భీమా, ప్రమాదాల్లో మరణించే గొర్లకాపర్లకు ఎక్స్ గ్రేషియాకు నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పశువైద్యశాలలకు నిధులు ఇవ్వలేదని, పశుసంక్షేమానికి నిధులు పెంచలేదని విమర్శించారు.