Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ నేత డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను తప్పుదోవ పట్టించే అంకెల పుస్తకంలా ఉందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఆధిపత్య వర్గాలకు చెందిన బడ్జెట్‌గా తేలిపోయిందని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు జరపడం పట్ల అభ్యతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో కేటాయించిన రూ. 17,700 కోట్ల దళిత బంధుతో దళితుల అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పాలని ప్రశ్నించారు. గురుకుల పాఠశాలల పక్కా భవనాల నిర్మాణానికి,మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ లో కేటాయింపులు జరిగలేదని తెలిపారు. నిరుద్యోగ భృతి,బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీల సంక్షేమం,అభివృద్ధిపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు.స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీలేకుండా రుణాల్ని అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.