Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంకెల గారడీతో మహిళా సంక్షేమాన్ని బడ్జెట్లో విస్మరించిందని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.దళిత బంధు తరహాలో మహిళా బంధు ప్రవేశపెడుతున్నామని మూడు రోజులపాటు రాష్ట్రంలో పాలాభిషేకాలు చేయించుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ఎప్పటిలాగే మహిళా శిశు సంక్షేమానికి బడ్జెట్లో మొండి చేయి చూపించారని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో వికలాంగుల శాఖను విలీనం చేసిన ప్రభుత్వం, సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు, పిల్లలు, వికలాంగులు కలిపి మొత్తం బడ్జెట్లో 0.76 శాతం మాత్రమే కేటాయించడం దుర్మార్గమని వారు పేర్కొన్నారు.