Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర బడ్జెట్ 2022-23 సంవత్సరానికి గాను పోలీసుశాఖకు రూ.9315 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్ కంటే ఈసారి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు అధికం. కాగా పోలీసు అధికారులు కోరుకున్నంతకాక పోయినప్పటికీ దాదాపుగా వారి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని పోలీసువర్గాలు తెలిపాయి. అవసరాల మేరకు నిర్వాహణ వ్యయము పెంచినట్టుగా బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. కాగా గత సంవత్సరం రూ.586.79 కోట్ల ప్రగతి పద్దు ప్రతిపాదించగా ఈ ఏడాది రూ.1468.47 కోట్లను కేటాయించారు. పోలీసు వాహనాలు, భవనాలకు రూ. 648 కోట్లు కేటాయించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పోలీసు స్టేషన్ల భవన నిర్మాణాలకు, వాహనాల కొనుగోళ్లకు రూ.648 కోట్లను కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఈసారి రూ. 96 కోట్లను కేటాయించారు. రాష్ట్రంలో మహిళా భద్రతకు రూ. 53.52 కోట్లను , ఇంటెలిజెన్స్ విభాగానికి 67.95కోట్లను కేటాయించారు.