Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర కమిటి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బడ్జెట్లో దళిత బంధుకు తగినన్ని నిధులు కేటాయించలేదని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లి, టి స్కైలాబ్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పథకానికి కనీసం రూ.30వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 118 నియోజకవర్గాల్లో 11,800 కుటుంబాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 2లక్షల మందికే దళిత బంధు ఇస్తామంటే .. మిగతా 18లక్షల కుటుంబాలకు ఈ పథకం లబ్ది చేకూరాలంటే ఎంత కాలం పడుతుందో చెప్పాలని ప్రశ్నించారు. తక్షణమే అర్హులందరికీ దళిత బంధు వచ్చే విధంగా బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. గత ఏడేండ్లలో రూ. 86 వేల కోట్ల రూపాయలు ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి కింద కేటాయించి రూ. 55వేల కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించిందనీ, ఆ చొప్పున సుమారు రూ. 31వేల కోట్లు ఖర్చు కాకుండా మురిగిపోయాయని తెలిపారు. ఆ నిధులను ఈ వార్షిక బడ్జెట్లో కలిపి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.మూడెకరాల భూమి కోసం బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఎస్సీ కార్పోరేషన్ రుణాల కోసం తగినన్ని నిధులు కేటాయించి షరతులు లేకుండా అర్హులందరికీ రుణాలు ఇవ్వాలని కోరారు.