Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి ఈ బడ్జెట్ చిహ్నమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. రూ.7,289 కోట్లతో సర్కారు బడుల అభివృద్దికి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని అన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు మేలు కలుగుతుందన్నారు. మహిళా వర్సిటీ, అటవీ విశ్వవిద్యాలయానికి రూ.వంద కోట్ల చొప్పున కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. జిల్లా కో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్‌రావు, భానుప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రల సంక్షేమ సంక్షేమానికి ఉపయోగపడేలా ఈ బడ్జెట్ ఉందన్నారు.
విద్యతోనే అభివృద్ధి సాధ్యం : జనార్ధన్‌రెడ్డి
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్సీ కె జనార్ధన్‌రెడ్డి చెప్పారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందడం సాధ్యమవుతుందని అన్నారు. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ విద్యారంగం బలోపేతమవుతుందన్నారు. మహిళా వర్సిటీని ప్రకటించినందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు.