Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎప్పుడు చేస్తారు? : జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఎన్నికల్లో రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఇది మూడో బడ్జెట్అనీ, రూ.75 వేల వరకు మాఫీ చేస్తామంటూ ఈ బడ్జెట్లో ప్రకటించారని చెప్పారు. ఈ ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి బడ్జెట్ అనీ, రూ.లక్ష వరకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. రూ.75 వేల వరకే పరిమితమైతే రైతాంగాన్ని మోసం చేసినట్టేనని విమర్శించారు. ఇది అంకెల గారడీ బడ్జెట్ తప్ప మరొకటి కాదన్నారు. రాజ్యాంగ నిబంధనలకు తిలోదకాలిస్తూ గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ఈ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. ఈ బడ్జెట్లో మద్దతు ధరల ప్రస్తావన లేదన్నారు. ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. పది శాతం కుటుంబాలకే దళితబంధు అమలయ్యేటట్టు నిధులు కేటాయించిందని అన్నారు. రాజకీయాలకతీతంగా అమలు చేయాలని కోరారు. గిరిజన బంధు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీలను ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నదని చెప్పారు. 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఉద్యోగాల భర్తీ ప్రస్తావన లేదన్నారు. ఇంకోవైపు నిరుద్యోగ భృతి అమలు చేయకుండా యువత ఆకాంక్షలను నీరుగారుస్తున్నదని విమర్శించారు.