Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు గతేడాదితో పోలిస్తే స్వల్పంగా నిధులను పెంచింది. రూ. 29.586 కోట్లను కేటాయించింది. గతేడాది బడ్జెట్లో 29,271 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈసారి పెంచింది కేవలం రూ.315 కోట్ల మాత్రమే. వరుసగా గత నాలుగు బడ్జెట్లలో పల్లెప్రగతికి ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్ర సర్కారు ఈసారి మాత్రం అంతగా పెంచలేదు. పంచాయతీరాజ్ శాఖ నిర్వహణ పద్దుకు రూ.7623.76 కోట్లు, ప్రగతిపద్దుకు రూ.5188 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహణ పద్దు కింద రూ.5,755 కోట్లు, ప్రగతిపద్దు కింద రూ.12,229 కోట్లను రాష్ట్ర సర్కారు కేటాయించింది. అందులో పల్లె ప్రగతికి రూ.3330 కోట్లు వెచ్చించనున్నది. తండాలు, ఆదివాసీ గూడాల్లో గ్రామపంచాయతీల నిర్మాణం కోసం రాష్ట్ర సర్కారు రూ.600 కోట్లను వెచ్చించనున్నది. ప్రధానంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, శ్మశాన వాటికల నిర్మాణం, డంపింగ్‌యార్డులు, ట్రాక్టర్ల కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం విదితమే.