Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్యూషన్‌కి వెళ్ళిన చిన్నారులపై అసభ్య ప్రవర్తన
- ఆస్పత్రికి తరలింపు
- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
నవతెలంగాణ - పటాన్చెరు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ కీచక మాస్టర్ తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామం సాయి ప్రియ కాలనీలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లికి చెందిన భట్టు సాల్మన్ రాజు (52) ప్రయివేటు టీచర్‌గా పనిచేస్తూ ఇంటివద్ద విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్నాడు. అయితే తన వద్దకు వచ్చే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి కొన్ని రోజులుగా బాలికలతో అనుచితంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. చిన్నారులు ట్యూషన్‌కు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు వారిని గట్టిగా నిలదీయగా ఉపాధ్యాయుడి ప్రవర్తన గురించి చెప్పారు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు స్థానికులతో కలిసి సల్మాన్ రాజు ఇంటికి వెళ్లి దేహశుద్ధి చేశారు. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడిని స్థానికులు పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడి తీరుపట్ల పలువురు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.