Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌరవాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(వీఆర్ఏ సంఘం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎస్కే దాదేమియా, వంగూరురాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు ఆ సంఘం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కార్యనిర్వాహక అధ్యక్షులుగా బి.రాములు, ఉపాధ్యక్షులుగా సీహెచ్ రాజయ్య, ఏ.బాలనర్సయ్య, పి.రమేష్, నర్సింహ (రంగారెడ్డి) పోశయ్య (మెదక్), విజరు (నాగర్ కర్నూల్), కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎల్ నరసింహ .నాగరాజు (సంగారెడ్డి) బాలరాజు (వికారాబాద్) శ్రీనివాస్ (నల్గొండ) ఆరుట్ల బాలయ్య (సిద్దిపేట) మల్లయ్య (సూర్యాపేట)లను ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీలోకి 43 మందిని తీసుకున్నారు. ఆయా జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.