Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన మంత్రులు కేటీఆర్,
- సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మహిళా జర్నలిస్టులను మంత్రుల కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సన్మానించారు. వివిధ పత్రికా, ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్న దాదాపు 80 మందికిపైగా మహిళా జర్నలిస్టులకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో పురస్కారాలు అందచేశారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ముందంజలో ఉందని, ప్రధానంగా మహిళా, శిశు సంక్షేమంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని అన్నారు. తెలంగాణా రాష్ట్రంగా ఏర్పడి ఈ ఎనిమిదేండ్లలో మహిళాభ్యుదయం, శిశు సంక్షేమ రంగంలో గణనీయమైన ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 17 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య లక్ష్మి కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహారాన్ని అందచేశామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 300 అమ్మఒడి వాహనాలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.