Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్ ఎన్నికయ్యారు. రెండు రోజులపాటు సూర్యాపేటలో జరిగిన సంఘం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయనను ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపా ధ్యక్షులుగా పి జంగారెడ్డి, కాసాని ఐలయ్య, సహాయ కార్యదర్శిగా లెల్లెల బాలక్రిష్ణ, కమిటీ సభ్యులుగా ఏ రాములు (మహబూబ్‌నగర్), అన్నవరపు సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి (రంగారెడ్డి), ఈసంపల్లి బాబు (వరంగల్) ఎన్నుకున్నట్టు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పుల్లయ్య (కొత్తగూడెం), రాజారావు (మహబూబాబాద్), బాపురెడ్డి (జనగామ), సత్తిరెడ్డి (సిద్దిపేట), చింత చలపతిరావు (ఖమ్మం).