Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్, భట్టి విక్రమార్క పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 1500 కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పటి వరకు కేవలం 500 కుటుంబాలకు మాత్రమే సాయం అందించారని పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదించిన బడ్జెట్ తెలంగాణ ఉద్యమకారులను అవమానించేలా బడ్జెట్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సీఎం కేసీఆర్కు చివరి బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి వారు విలేకర్లతో మాట్లాడారు. తొలి అసెంబ్లీ సమావేశంలో చెప్పిన విధంగా అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిందేనన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామనీ చెప్పి... చివరి బడ్జెట్లోప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటివరకు ఉద్యోగాలు నియామకాలు లేవన్నారు. సొంత స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణం కోసం రూ5 లక్షలు ఇస్తామని చెప్పి, రూ.3 లక్షలకు కుదించారని విమర్శించారు. శాసనసభ నిర్వహణ నిబంధనలకు భిన్నంగా సాగుతున్నదని విమర్శించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సభ్యులపై చర్యలు ఉండవన్నారు. ఏమైనా చర్యలు తీసుకోవాలంటే బీఏసీలో నిర్ణయం తీసుకున్న తర్వాతే తీసుకోవాలని కోరారు. సిద్ధాంత పరంగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తాం కానీ, సోమవారం నిబంధనలకు భిన్నంగా చర్చించకుండానే సభ్యులను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఏడు రోజులకు కుదించారనీ, గతంలో 30 రోజులు జరిగేవని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సైగ చేయగానే... స్పీకర్ ఆదేశాలు ఇవ్వడమెంటని అని ప్రశ్నించారు. స్పీకర్ తీరుకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో బుధవారం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహాల వద్ద నల్ల రిబ్బన్లు మూతికి కట్టుకుని నిరసన తెలియజేయాలని కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇస్తామని చెప్పారు.