Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి ప్రస్తావన ఎక్కడుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నించారు. సోమవారం శాసనమండలి మీడియాపాయింట్లో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల క్యాడర్ విభజన పూర్తయ్యిందని చెప్పారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్లో భారీగా అంకెలను పెంచిందని విమర్శించారు. ఏడేండ్లలో బడ్జెట్ ప్రతిపాదనలకు, ఖర్చుకు తేడా ఉంటుందన్నదని చెప్పారు. ఈ బడ్జెట్ సైతం అందుకు భిన్నంగా లేదన్నారు. బడ్జెట్ కేటాయింపులను ఖర్చు చేసేదిగా ఉండాలని సూచించారు. మన ఊరు మనబడి కార్యక్రమానికి ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టంగా ప్రకటించలేదన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలనూ మన ఊరు మనబడి కింద అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ ఇబ్బందిగా మారిందన్నారు. అందుకోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని సూచించారు. మహిళా, అటవీ వర్సిటీలకు రూ.వంద కోట్ల చొప్పున కేటాయించడాన్ని స్వాగతించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయాలని కోరారు.