Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిటీబ్యూరో : 'స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సష్టేలేదు' అని జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎంఓహెచ్) పద్మజ అన్నారు. కంటి పాపలా కాపాడే 'స్త్రీమూర్తి'కి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి అమ్మాయిలు విద్య, విజ్ఞానం, ఉద్యోగం, వ్యాపారం, సాధికార తతో తన కుటుంబాన్ని, సమాజాన్ని దేశాన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ విలువలతో భావి తరానికి బాటలు వేయాలని అన్నారు. పురుషులు తమ తోటి ఉద్యోగస్తులైన మహిళలను గౌరవించి విధి నిర్వహణలో వారి సేవలు సమాజా నికి అందేలా సహకరిస్తేనే మనం బంగారు భవితతో సమాజాన్ని సన్మార్గంలో ముందుకు తీసుకెళ్లగలమని అన్నారు. 'యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా' - స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని తెలిపారు.