Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మరోసారి
- మోసం చేయబోతున్నడు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎగ్జిట్ పోల్స్ అన్నీ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీదే అధికారమని ప్రకటించడంతో కేసీఆర్‌లో వణుకు ప్రారంభమై నిరుద్యోగులకు శుభవార్త అంటూ కొత్త డ్రామా మొదలెట్టారనీ, నిరుద్యోగులారా మరోసారి మోసం చేయబోతున్నాడు తస్మాత్ జాగ్రత్త అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ మరో జిమ్మిక్కు చేయబోతున్నాడని విమర్శించారు. 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఉద్యోగాల ప్రకటనకు ముందు ప్రతి నిరుద్యోగికి ఇవ్వాల్సిన రూ.1.20 లక్షల నిరుద్యోగ భృతి బకాయిని చెల్లించాలని డిమాండ్ చేశారు. నువ్వెంత ? నీ పార్టీ బలమెంత? మంది దగ్గర గెల్చినోళ్లను తెచ్చుకుని బలమని మురిసిపోకు అని హెచ్చరించారు. బీజేపీని బంగాళాఖాతంలో కలపడం ఎవ్వరి తరం కాదన్నారు.