Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ సభ్యుల సస్పెండ్‌పై రాష్ట్రపతిని కలుస్తాం : రఘునందన్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతిపక్షం బాగుంటేనే స్పీకర్‌కు గౌరవం పెరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. తమపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసి సస్పెండ్ అంశాన్ని వివరిస్తామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని తెలిపారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. శాసనసభలో స్పీకర్ తీరు కీలుబొమ్మ మాదిరిగా ఉందని విమర్శించారు. ఏ సెక్షన్ కింద బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారో ప్రజలకు స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో గవర్నర్‌ను అవమానిస్తూ.. బల్లలు ఎక్కిన హరీష్ రావుతో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదన్నారు. తమ స్థానంలో నిలబడి నిరసన చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్వయంగా రాసి ఇచ్చిన పేపర్‌ను తలసాని సభలో చదివారన్నారు. పాలకపక్షంతో పాటు.. ప్రతిపక్షం కూడా బాగుంటేనే స్పీకర్ గౌరవం పెరుగుతుందని తెలిపారు. ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేశారో రాతపూర్వకంగా చెప్పాలని అసెంబ్లీ సెక్రటరీని అడిగితే నాలుగు రోజులు సమయం అడగటం దారుణమని విమర్శించారు.