Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్ అన్వేష్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ రైతులను విస్మరించేలా ఉందని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్‌రెడ్డి విమర్శించారు. గతేడాది బడ్జెట్‌తో పోల్చితే...ఈసారి రూ 700 కోట్లు కోత పెట్టిందని చెప్పారు. రైతు బీమా, రైతు బంధుకే ఎక్కువ నిధులు కేటాయించిందని చెప్పారు. ధరల స్థిరీకరణకు మొండిచేయి చూపారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పంటల రుణమాఫీకి నిధులు తగ్గించారని చెప్పారు. పంటలు, వడ్ల కొనుగోళ్ల కోసం నిధులు కేటాయించలేదన్నారు. పంట నష్టపోయి అప్పులపాలైన వారికి జీవో నెంబర్ 190 ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో వ్యవసాయానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈనెల 11న కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తామని చెప్పారు.
'టిమ్స్' ఆస్పత్రి మూసివేత తగదు : దాసోజు శ్రవణ్
కరోనా సమయంలో ఏర్పాటు చేసిన టిమ్స్ ఆస్పత్రి మూసేయడం తగదదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ చెప్పారు. కాంట్రాక్టు సర్వీసులో తీసుకున్న సిబ్బందిని తొలగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 30వేల మంది కరోనా రోగులకు సేవలు అందించారని గుర్తు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 1700 మంది నర్సులను ఒప్పంద సమయం అయిపోయిందంటూ తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల ప్రయోజనాల కోసమే టిమ్స్ ఆస్పత్రిని మూసివేస్తున్నారని ఆరోపించారు.